పయనించే సూర్యుడు జనవరి 15 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ఎక్స్ కౌన్సిలర్ మారుతి టిడిపి నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు అన్ని రకాలుగా ఆదోని అభివృద్ధికి కష్టపడుతుంటే ఆదోనిలో నిన్న జరిగినటువంటి మునిసిపల్ బడ్జెట్ సాధారణ సమావేశానికి వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు హాజరు కాకుండా కేవలం వాళ్ళ స్వలాభాలు కూటమికి మంచి పేరు రాకుండా ఆదోనిని అభివృద్ధి కాకుండా అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించడం జరిగినది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆదోని అన్ని విధాల అభివృద్ధికి కట్టుబడి ఉందని వైసిపి కౌన్సిలర్లు ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఇలా నడుచుకోవడం ఆదోని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో సరైన గుణపాఠం మీకు చెబుతారని రాష్ట్రంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 151 నుండి 11 సీట్లకు కుదించడం జరిగిందని హెచ్చరిస్తూ మీకు కూడా ఆదోని ప్రజలు దాదాపు 90% సీట్లు మీకు కట్టబెడితే ఆదోని ప్రజల అభివృద్ధినీ అడ్డుకుంటూ ఉంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని హెచ్చరించడం జరిగినది.