పయనించే సూర్యుడు15-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో యువకుడు గంజాయితో వెళుతున్నాడని సమాచారం అందగానే చందోలి శివారులో గల రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించి అటుగా వెళుతున్న యువకుడిని అందుబాటులోకి తీసుకొని తనిఖీ చేయగా అతడి వద్ద 89 గ్రాముల గంజాయి దొరికినది. అతడి వివరాలు తెలుసుకోగా అతడు వెల్గటూర్ మండలo జగదేవ్ పేట గ్రామానికి చెందిన బచ్చల రామ్ చరణ్ అని తెలిపినాడు. అతడిని విచారించగా అతడు చెడు వ్యసనాలకి బానిస అయి,తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచనతో ఎండపల్లి మండలo లోని కొత్తపేట గ్రామానికి చెందిన సాయి సిద్ధు వర్ధన్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొనుక్కొని, అమ్ముతానని తెలిపినాడు. సాయి సిద్ధు వర్ధన్ మరియు రామ్ చరణ్ పై ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.