పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15, 2026: న్యూస్ గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు స్త్రీ శక్తి పథకం ద్వారా తమ జీవనోపాధిని కోల్పోయమని ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పించడం వల్ల మహిళలు ఆటోలలో ప్రయాణించడం మానేశారని తద్వారా ఆటో కార్మికులు జీవన భృతి భారంగా ఉందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ తమ కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నామని అన్నారు. కాలను గుణంగా ఎన్నో సమస్యలు వస్తున్నా తమ వృత్తిని నమ్ముకుని కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. నూటికి 99 శాతం ఆటో కార్మికులు ఆటోలను ఫైనాన్స్ పై లేదా బ్యాంకు లోన్ పై కొనుగోలు చేసి నడుపుతున్నామని తద్వారా నెలకి సుమారు 12 వేల రూపాయలు నెలసరి వాయిదా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇదేకాక ఆటో రిపేర్లు, మెయింటినెన్స్ నెలకు 8 వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. నెలసరి 20 వేల రూపాయలు బండి మెంటన్స్ కె సరిపోతాయని ఇలాంటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని, ఆవేదన వ్యక్తం చేశారు. వాహన మిత్రి పథకం ద్వారా సంవత్సరానికి 15000 రూపాయలు ముష్టి వేసి ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే 15వేల రూపాయలు, సంవత్సరానికి ఒకసారి బండి ఫిట్నెస్ ఎఫ్ సి, ఇన్సూరెన్స్, కె సరిపోతుందని, శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటోలు ఎక్కి పరిస్థితి లేదు, అలాంటప్పుడు పిల్లల చదువులు, కుటుంబ పోషణ ఎలా గడపాలి తెలియని పరిస్థితి, ఆటో బయటకు తీస్తే కనీసం 200 రూపాయల కూడా రాణి పరిస్థితి ఇలా ఎన్ని రోజులు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత బస్సులు లేవు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాహనా మిత్ర పథకంతో 15వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆటో కార్మికులకు అందించారని, ఆ ఆర్థిక సహాయంతో ఆటో ఫిట్నెస్ చేసుకునేవారుమని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే 15000 రూపాయలతో సంస్థ కాలం మొత్తం మీదుగా కుటుంబ పోషణకు ఎలా వీలవుతుందో నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆటోలపై ఆధారపడే కుటుంబాలు వందలలో వేళలో కాదు లక్షల్లో ఉన్నారని, రెండు దాఫాల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆటో కార్మికులను బిచ్చగాళ్లగా తయారుచేశాయని, మూడో దాఫాలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డున పాడేసాయని, నాయకుల గెలుపు అధికారం కోసం స్వార్థపూరిత హామీలతో అనాలోచిత నిర్ణయాలతో లక్షల ఆటో కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా రోడ్డున పడ్డారని, కూటమి ప్రభుత్వం ఇంకా మూడేళ్ల పాలనలో ఆటో కార్మికుల కుటుంబాలు దయనీయ పరిస్థితి ఎదురుకోవాల్సి వస్తుందని, వచ్చే 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మూల్యం తప్పదు,వైసీపీ ప్రభుత్వానికి మా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే దిశగా ముందుకెళ్తామని తీయజేసారు. ఈ నియోజకవర్గ ఆటో కార్మికుల యూనియన్ సభ్యులతో పాటు రాష్ట్రం మొత్తం కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు.