
పయనించే సూర్యుడు జనవరి 15 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటును డివైఎఫ్ఐ మాజీ నాయకులు వెంకటేశులు టాస్ వేసి ప్రారంభించారు. ఫ్రెండ్లీ టోర్నమెంట్ క్రీడాకారులను ఉద్దేశించి డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్,సతీశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, రవి, పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు యువ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నమెంట్ ఉద్దేశించి వీరు మాట్లాడుతూ నిత్యం విద్యార్థి యువజన, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ మరోపక్క యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సంక్రాంతి పండుగలు, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీర యువకిశోరాల వర్ధంతులు, జయంతులు సందర్భంగా ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదోని పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సరైన ఆట స్థలాలు లేకపోవడంతో చాలామంది యువత క్రీడలకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రీడాకారుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు నటిస్తున్నారని వారు గుర్తు చేశారు. క్రీడల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు అన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ సందర్భంగా యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ సమాజానికి తెలియజేసే పద్ధతుల్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ యువకులు వినోద్, నాగరాజు, వీరేష్, మహబూబ్, అజయ్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.