
పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి. 15. 2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం పాముగండి పంచాయతీ పరిధిలోని దొనలంక గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన దొనలంక విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ ఐదు ఘనంగా ముగిసింది ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఇరవై ఆరు జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్‌లో తున్నూరు మరియు పాముగండి జట్లు తలపడ్డాయి ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఫైనల్ పోరులో తున్నూరు జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా పాముగండి సర్పంచ్ శివ రెడ్డి మాట్లాడుతూ…ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు స్పోర్ట్స్ స్పిరిట్‌తో ముందుకు సాగాలని సూచించారు గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రికెట్ గ్రౌండ్‌ను ప్రేమించాలి అని పిలుపునిచ్చారు విజేతగా నిలిచిన తున్నూరు జట్టుకు ట్రోఫీతో పాటు రూ.10,000 నగదు బహుమతి రన్నర్‌గా నిలిచిన పాముగండి జట్టుకు ట్రోఫీతో పాటు రూ.6,000 నగదు బహుమతిలను సర్పంచ్ శివ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో పాముగండి సర్పంచ్ శివ రెడ్డి వార్డు మెంబర్ కుండ్ల వెంకటేశ్వర్లు రెడ్డి గ్రామ పెద్దలు లింగ రెడ్డి లచ్చి రెడ్డి కృష్ణ రెడ్డి టోర్నమెంట్ కమిటీ సభ్యులు యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.