పయనించే సూర్యుడు జనవరి 15, ( చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో గోదా రంగనాథ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛరణల మధ్య తిరు కళ్యాణ కార్యక్రమం కొనసాగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.