
పయనించే సూర్యుడు జనవరి 15 ఆదోని నియోజకవర్గం రిపోర్టర్ కృష్ణ. స్థానిక నారాయణ పాఠశాలలో, ముందస్తు సంక్రాంతి పండుగను, పాఠశాల ఏజీఎం అయినటువంటి రమేష్ కుమార్ అధ్యక్షతన, ప్రిన్సిపాల్ లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రమేష్ కుమార్ సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి మాట్లాడారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం, పంటల కోత,ప్రకృతి ఆరాధన,కుటుంబ కలయిక,దానధర్మాల వంటి అనేక అంశాల గురించి చాలా చక్కగా ప్రశంసించడం జరిగింది. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే రైతుల ఆనందానికి, పశువుల పూజకు, కొత్త ఆశలకు, సంప్రదాయాల పునరుజ్జీ వనానికి ప్రతీక అని, సంక్రాంతి అంటే సంప్రదాయాలు, సరదాల సంగమo, ముగ్గులు, గంగిరెద్దుల మేళాలు, హరిదాసులు, డూడూ బసవన్నల సందడితో పల్లెటూర్లు ఉత్సాహబరితంగా ఉంటాయి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పిల్లల తలమీద భోగి పళ్ళు పోసి వాళ్లను ఆశీర్వదించారు , భోగి మంటల మీద కొత్త ఆహార ధాన్యాలతో చక్కెర పొంగలి తయారు చేసి అందరికీ నైవేద్యంగా సమర్పించడం జరిగింది, కొందరు విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా హరిదాసుల వేషాదరణ వేసి అందరినీ అలరించారు, ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు, ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి జయప్రదం చేశారు.