పయనించే సూర్యుడు, కోరుట్ల, జనవరి 15 కోరుట్ల పట్టణంలో ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రజా జ్యోతి 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను కోరుట్ల సీఐ సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోరుట్ల సీఐ కార్యాలయంలో జరగగా, ప్రజా జ్యోతి పత్రిక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న తీరును ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రజా జ్యోతి పత్రిక సమాజంలో జరుగుతున్న సమస్యలను నిస్పాక్షికంగా వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఆ బాధ్యతను ప్రజాజ్యోతి సమర్థవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజా జ్యోతి 2026 క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు పత్రిక భవిష్యత్తులో మరింత ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాజ్యోతి రిపోర్టర్ సుజాయిత్ అలీ, ప్రజాజ్యోతి రూరల్ రిపోర్టర్ మోహన్, పాత్రికేయులు, లక్మిరాజాం, నర్సయ్య, రాజారెడ్డి, అన్వర్ సిద్ధికి, సాజిద్ అలీ, ముక్రం బైగ్, సలాఉద్దీన్, రమణ, హుస్సేన్, రాధాకృష్ణ, శ్రీకాంత్, శంకర్, అస్లాం, తదితరులు పాల్గొన్నారు.