వొడ్నాల రాజశేఖర్ ను సన్మానించిన ఉపాధ్యాయులు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ని రాయికల్ మండలానికి చెందిన తపస్ సంఘ ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయికల్ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మండల జిల్లా బాధ్యులు గుర్రం సత్యనారాయణ గౌడ్, కొండూరి రజనీకాంత్, చెరుకు మహేశ్వర శర్మ, కడార్ల రాజేందర్, పుర్రె రమేష్‌ తో పాటు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్ రావు పాల్గొన్నారు.రాష్ట్ర తపస్ సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్ ఈ సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే సంఘ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.