పయనించే సూర్యుడు ప్రతి నీధి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కంచికచర్ల బైపాస్ రోడ్ లో వేంచేసి వున్న శ్రీ శివ సాయి క్షేత్రం అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనాన్ని ఘనంగా నిర్వహించారు. శబరిమలైలో అయ్యప్పలకు సంక్రాంతి పర్వదినాన దర్శనమిచ్చే మకర జ్యోతి మాదిరిగానే, బుధవారం రాత్రి కంచికచర్ల శ్రీ శివసాయి క్షేత్రం లో గల అయ్యప్ప దేవాలయంలో కేరళ శబరిమల లో జ్యోతి దర్శన సమయానికి కంచికచర్ల అయ్యప్ప స్వామి దేవాలయం లో కూడా జ్యోతి దర్శనాన్ని ఆలయ పూజారి బ్రహ్మశ్రీ పద్మనాభన్ నంబూద్రి (పప్పాస్వామి) ఏర్పాటు చేశారు. ఆలయ పై భాగంలో కర్పూరపురాసి పోసి, భక్తుల శరణు ఘోష మధ్య పప్పా స్వామి జ్యోతిని వెలిగించారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుగాయి. వందలాదిగా భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజారి నంబూద్రి పద్మనాభ పప్పా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈపూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
