పయనించే సూర్యుడు ,15 జనవరి భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, 2026, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వీడిసి సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి మహిళల మరియు పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భీంగల్ మహిళా కబడ్డీ జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని సంపాదించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కూతురు సుచరిత రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలని క్రీడాకారులకు సూచించారు. అలాగే విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులను అభినందించారు. భీంగల్ జట్టుకు వీడిసి మరియు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో షీల్డ్‌తో పాటు రూ.11,000 నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ గోపిరెడ్డి, అంకాపూర్ గ్రామ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, వీడిసి అధ్యక్షులు గంగారెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగాధర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేందర్ పీడీ, ఎన్‌ఆర్‌ఐ ఎన్.సి. గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.