
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 15 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎం),అనుబంధ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ స్వగ్రామం మండలంలో ని గుంటిమడుగు లో బుధవారం పార్టీ స్థానిక కుటుంబాలకు చెందిన అమరులు సోడెం లక్ష్మయ్య, వర్షా రామారావు, బోడయ్య, వర్షా యెర్ర ముత్యాలు, బజారు, వెంకమ్మ ల జ్ఞాపకార్ధం, మండల కార్యదర్శి ప్రసాద్ పర్యవేక్షణలో పలు పోటీలు నిర్వహించారు. వివాహా హితులు,బాలికల విభాగాల్లో రంగోలి, స్త్రీ పురుష, చిన్న పిల్లల విభాగాల్లో టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలు, ముఖ్యులు, జిల్లా నాయకులు బి.చిరంజీవి,నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ,స్థానిక వార్డు సభ్యురాలు వర్ష ముత్తమ్మ లు వ్యవహరించారు. రంగోలి లో వివాహితులు విభాగంలో వర్ష అనిత,వర్ష వెంకట లక్ష్మి, రమాదేవి లు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. బాలికల విభాగంలో బిట్ట నందిని, పాయం నవ్య, వర్ష రుక్మిణి లు ప్రధమ, ద్వితీయ తృతీయ బహుమతులు గెలుపొందారు.టగ్ ఆఫ్ వార్ వర్ష శివ క్రిష్ణ టీం మొదటి స్థానంలో, వర్ష ముత్యాలు రావు టీం రెండో స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో వర్ష నారమ్మ టీం ప్రధమ, వర్ష వెంకటలక్ష్మి టీం ద్వితీయ స్థానాల్లో గెలుపొందారు. పిల్లల విభాగంలో వర్ష అమృత టీం మొదటి స్థానంలో, బంధం దాన్విక టీం రెండో స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, స్థానిక శాఖా కార్యదర్శులు వర్ష రమేష్, వర్ష సురేష్ లు పాల్గొన్నారు.