
పయనుంచే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 17.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి కురపల్లె పరికిదోన గడ్డం వారి పల్లి ఆమినిగుంట పంచాయతీలోని కొన్ని గ్రామాలు మినహా మండల వ్యాప్తంగా అన్ని పంచాయతీలలోని పల్లె సీమల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు పశువులను అందంగా అలంకరించి గ్రామాల్లో ఊరేగించి అనంతరం కాటమరాజు ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు సంక్రాంతి ముగ్గులు పూజాధి కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు వివిధ ప్రాంతాలలో పనులు చేసుకుంటూ సొంత గ్రామాలకు వచ్చిన వారితో పల్లె సీమలన్నీ నిండుగా కనిపించాయి