అశ్వారావుపేటలో బీసీలకు తీవ్ర అన్యాయం

* ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు * 22 వార్డుల్లో బీసీలకు రావాల్సిన 7కు బదులు కేవలం 4 * కాంగ్రెస్ హామీలు గాలిలో కలిశాయి – ఆరేపల్లి వెంకటేష్ (గౌడ్ (గోవింద్)

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మున్నూరు అశ్వారావుపేట గీత కార్మిక సంఘం అధ్యక్షులు. గౌడ సంగం కార్యదర్శికార్యదర్శి ఆరేపల్లి వెంకటేష్ గౌడ్ (గోవింద్ )తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 12 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ, ఆ జీవో మున్సిపాలిటీలో పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 31 శాతం మాత్రమే ప్రకటించడమే కాకుండా, ఆ పరిమిత రిజర్వేషన్లను కూడా స్థానికంగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ప్రభుత్వ జీవో ప్రకారం ఎస్టీలకు 6 శాతం అంటే ఒక్క వార్డ్ మాత్రమే రావాల్సి ఉండగా, మూడు వార్డులకు ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఎస్సీలకు 12 శాతం ప్రకారం మూడు వార్డులు రావాల్సి ఉండగా, నాలుగు వార్డులు కేటాయించడం కూడా జీవోకు విరుద్ధమని తెలిపారు. బీసీలపై కావాలనే వివక్ష బీసీలకు 31 శాతం రిజర్వేషన్ల ప్రకారం 22 వార్డుల్లో కనీసం 7 వార్డులు రావాల్సి ఉండగా, కేవలం నాలుగు వార్డులు మాత్రమే కేటాయించడం బీసీలపై కావాలనే చేసిన వివక్షేనని. గోవింద్. ఆరోపించారు. ఇది అశ్వారావుపేట బీసీ ప్రజలను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. 2011 జనాభా పేరుతో ప్రజల మోసం 2011 జనాభా లెక్కలను ఆధారంగా చూపుతూ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో అల్లిగూడెం, ఊట్లపల్లి గ్రామాలు అశ్వారావుపేట రెవెన్యూ గ్రామంలో కలిసివుండటం వల్ల ఎస్టీ జనాభా ఎక్కువగా కనిపించిందని, ప్రస్తుతం ఆ గ్రామాలు విడిపోయిన నేపథ్యంలో అశ్వరావుపేటలో ఎస్టీ జనాభా చాలా తక్కువగా ఉందని వివరించారు. అయినప్పటికీ పాత లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అధికారుల మౌనం – కాంగ్రెస్ ఉద్దేశ్యంపై అనుమానాలు ఈ విషయంలో జిల్లా అధికారులు స్పందించకపోతే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీసీలకు చేసిన అన్యాయంగానే భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లు ఖరారు చేశామని వాదిస్తే, మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేకంగా జనాభా వివరాలు సేకరించిన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయాలి మండల, జిల్లా, రాష్ట్ర అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ జీవో ప్రకారం రిజర్వేషన్లను సరిచేసి, అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీసీలకు తగిన న్యాయం చేయాలని ఆరేపల్లి వెంకటేష్ గౌడ్ గోవింద్ సొసైటీ అధ్యక్షులు అశ్వరావుపేట గీత కార్మిక సొసైటీ అధ్యక్షులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *