పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 బోధన్ :ఎడపల్లి స్థానిక ఉద్యోగుల సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం జరిగింది. సంఘ చరిత్ర క్లుప్తంగా అధ్యక్షులు వివరించారు అలాగే సంఘ అవసరాలను తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సహకారాన్ని అభ్యర్థించారు.సంఘ అభ్యర్థనలు సహేతుకమైనవే కాబట్టి తప్పక సహకరిస్తామని సర్పంచ్ కందకట్ల రాంచందర్, ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్ లు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి లో స్థానిక ఉద్యోగుల సంఘం"రిటైర్డ్ & వర్కిగ్ ఉద్యోగుల స్వచ్చంద సేవా సంస్థ పాత గణనీయమని భవిష్యత్తులో గ్రామానికి సంఘ సేవలు చాలా అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు పి.రాజలింగం, కార్యవర్గ సభ్యులు యస్.గంగాధర్, కె.శంకర్, బి.నరసింహరాజు, బేబీ రాణి, యం.గంగమణి, గ్రామస్తులు యం. శ్రీ నివాస్,నగేశ్ పాల్గొన్నారు.