కనుమ పండుగ ఐక్యతకు ప్రతీక – పల్నాడు జిల్లా వైసీపీ మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండలము మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా శుభాకాంక్షల సందేశాన్ని తెలియజేశారు. కనుమ పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానాన్ని, రైతు కష్టాన్ని, ప్రజల మధ్య సోదరభావాన్ని గుర్తుచేసే పర్వదినమని ఆయన అన్నారు. అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడం మన సంస్కృతికి గర్వకారణమన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. కనుమ పండుగ సందర్భంగా యడ్లపాడు మండల ప్రజలందరికీ శుభదినాలు కలగాలని కోరుకుంటూ, పండుగ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని పిలుపునిచ్చారు..