కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు జనవరి 17 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి పండుగనుసంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు పల్లె సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే ముఖ్యమైన పర్వదినమని తెలిపారు. వ్యవసాయం ప్రకృతి కుటుంబ బంధాల ప్రాధాన్యతను ఈ పండుగ ప్రతిబింబిస్తుందన్నారు అధికారులు ఉద్యోగులతో కలెక్టర్ ఆత్మీయంగా మమేకమై పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగుల మధ్య ఐక్యత మంచి వాతావరణం పెంపొందించేలా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు సిబ్బంది సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *