పయనించే సూర్యుడు జనవరి 17 ఎన్ రజినీకాంత్:- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ వీరేశం తెలిపారు. జనవరి 13 నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ జాతర కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించేందుకు జాతర ప్రాంగణాన్ని మొత్తం 3 జోన్లుగా మరియు 9 సెక్టార్లుగా విభజించమని తెలిపారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు నలుగురు ఎంపీఓలు, ఒక డిఎల్పీఓ, 40 మంది పంచాయతీ కార్యదర్శులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 70 మంది, మధ్యాహ్నం 70 మంది చొప్పున పారిశుధ్య సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని తెలిపారు. జాతర పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, క్రమం తప్పకుండా బ్లీచింగ్ చల్లడం దుమ్ము లేవకుండా వాటరింగ్ చేయడం వంటి చర్యలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. షాపుల యజమానులు తమ వద్ద చేరిన చెత్తను బయట వేయకుండా, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలోనే వేయాలని కోరారు. భక్తులందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో సహకరించాలని విన్నవించారు. ఈ జాతర ముగిసే వరకు (18వ తేదీ) సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని ఎంపీడీఓ స్పష్టం చేశారు..