కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఘనంగా కనుమ వేడుకలు

★ నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు.

పయనించే సూర్యుడు జనవరి 17 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం కనుమ పండుగను పురస్కరించుకొని వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి వాహనమైన నందీశ్వరునికి (బసవన్న) విశేష అభిషేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ముగింపు రోజైన కనుమ సందర్భంగా, తెల్లవారుజాము నుంచే అర్చక స్వాములు నందీశ్వరునికి పంచామృతాలతో, గంగాజలంతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరుడిని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి పి. కిషన్ రావు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.