పయనించే సూర్యుడు, కోరుట్ల జనవరి 17. కోరుట్ల పట్టణం లో భోగి, సంక్రాంతి కనుమ సందర్భంగా భోగి మంటలు, గంగిరెద్దుల నృత్యాలు, కోలాటం, ముగ్గుల పోటీలతో పండుగను ఘనంగా జరుపుకున్నారు.పట్టణం లో వీధులు అన్ని ముగ్గులతో గొబ్బమ్మలతో చిన్న పిల్లల కోలాహలంతో కన్నుల విందుగా జరుపుకున్నారు. వ్యవసాయంలో తోడుగా ఉండే పశుపక్షాదులను గౌరవించి పూజలు చేసారు. సంక్రాంతి రోజున గాలిపటాలు, ముగ్గుల పోటీలు, కమ్మని పిండివంటలతో ఇళ్లు కళకళలాడాయి. పక్షుల కోసం ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులు కట్టడం సంప్రదాయంలోని గొప్పతనాన్ని చాటారు.