పయనించే సూర్యుడు జనవరి 17 నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్: కె. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి కప్పుతో పాటు రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఉపసర్పంచ్ దాసరి శివ రూ.5,000 నగదు బహుమతిని ప్రదానం చేశారు. విజేత, రన్నరప్ జట్లకు సంబంధించిన కప్పులను మాజీ వార్డు సభ్యుడు శివుడు, వికెట్లు–బాల్స్ స్పాన్సర్లు సొప్పరి శివ, లేట్ల శివకృష్ణ, లేట్ల భీమారావు, వట్టెం నాగేంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి, ఉపసర్పంచ్ దాసరి శివతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పరి సంజీవ్, శీను, కుమ్మరి నాగరాజు పాల్గొన్నారు. అలాగే క్రీడాకారులు కె.శ్రావణ్ కుమార్, కె.రాజు, వి.నరేందర్, వి.శివకుమార్, వి.సందీప్, మహేష్, పొలమూరు అంజి, లేట్ల నవీన్, లేట్ల వేణు, కె.శంకర్, ఎల్.ప్రశాంత్, మేకల లక్ష్మీకాంత్. రామకృష్ణ, శ్రీకాంత్, శివశంకర్, లడ్డు శ్రీకాంత్‌లతో పాటు గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.