గొల్ల,కురుమ సోదరులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బబ్బురి శ్రీకాంత్ గౌడ్

పయనించే సూర్యుడు జనవరి 17 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)పెద్దమడూర్ గ్రామ గొల్ల కురుమ సోదరులు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ను కలిసి డోల్లు, తాళాలు కావాలని కోరగా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ వారి కోరికను నెరవేస్తూ శుక్రవారం గొల్ల కురుమ సోదరులకు డోల్లు తాళాలు అందజేసి వారి హామీని నెరవేర్చాడు. ఈ సందర్భంగా గొల్ల కురుమ సోదరులు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సత్కరించి మాట ఇస్తే మడమ తిప్పన నాయకుడనివారు కొనియాడారుఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ వారికిచ్చిన హామీ మేరకు డోల్లు తాళాలు అందజేయడం జరిగిందని గ్రామంలో గతంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పానుగంటి గిరి గ్రామ పార్టీ అధ్యక్షుడు బండ రాములు మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల ఉమేష్ సీనియర్ నాయకులు కిషోర్ బోరేం నరేందర్ గోరుపెల్లి సంపత్ ఉపసర్పంచ్ సంపత్ వార్డు సభ్యలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *