గ్రామ పంచాయతీ పాలక వర్గం ను ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్.

★ గ్రంథాలయ నిర్మాణానికి భూమిని ఇచ్చిన గంట వెంకటేశం.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 17. చండూరు మండలం కస్తాల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాన్ని కస్తాల ఎంప్లాయిస్ యూనియన్ ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి పాలక వర్గం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అని పాలక వర్గం తెలిపారు.మరియు అదే విధంగా కస్తాల గ్రామపంచాయతీకి యువతకు మరియు నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంట వెంకటేశం వాళ్ల తండ్రి పేరు మీదుగా రెండు గుంటల స్థలాన్ని గ్రంధాలయానికి ఈ సంక్రాంతి పర్వదినాన కొత్త పాలకవర్గం మరియు కస్తాల ఎంప్లాయిస్ యూనియన్ సన్మాన కార్యక్రమంలో గ్రంధాలయానికి స్థలం ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది . దీనికి ప్రత్యేకంగా మా కస్తాల నూతన పాలకవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎంప్లాయిస్ యూనియన్ మరియు గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మాకు ఎల్లవేళలా సహకరించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు , మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.