పయనించే సూర్యుడు జనవరి 17, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : సిపిఐ వందేళ్ళ సుదీర్ఘ పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేసి, భవిష్యత్తు ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలని లక్ష్యంతో 2026 జనవరి 18న ఖమ్మంలో చారిత్రక బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ చింతకాని మండల కార్యదర్శి దూసరి గోపాలరావు తెలిపారు. శుక్రవారం చింతకానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 18న సాయంత్రం మూడు గంటలకు ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో లక్షలాది మందితో ఈ బహిరంగ సభ జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా. జాతీయ నాయకత్వం అన్ని రాష్ట్రాల కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఈ సభకు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభకు రానున్నారని వెల్లడించారు. చింతకాని మండలం నుంచి ప్రజలు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు తదితర వాహనాల్లో భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, యువత శ్రామిక కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాసు, కరీముల్లా, సాయి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.