తిరుపతమ్మ అమ్మవారి సన్నిధి లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 17 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెనుగంచిప్రోలు గ్రామంలోని వేచిన గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నాకు విచ్చేశారు ఈ సందర్భంగా తిరుపతమ్మ ఆలయ ఈవో ఆదేశాల మేరకు తిరుపతమ్మ దేవస్థానం ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ మరియు పాలకవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టు విక్రమార్క, శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ఆలయ రాజ గోపురం నుండి దేవాలయంలోకి తీసుకువెళ్లి శ్రీ అమ్మవారి దర్శనానంతరం అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు ప్రతిమ తీర్థ ప్రసాదములు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినములలో కనుమ రోజైన ఈరోజు ఎంతో మహిమగల శ్రీ అమ్మవారి దర్శనం లభించుట చాలా సంతోషంగా ఉందని చెబుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ . తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ రేపాల మోహన్ రావు మరియు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు , గజ్జి పెద్ద ఆంజనేయులు. రాష్ట్ర బీసీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ ఆలయ సిబ్బంది తిరుపతమ్మ దేవస్థానం ఏ ఈ ఓ జంగం శ్రీనివాసము తిరుపతమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు గోపి బాబు ఆలయ ఇన్స్పెక్టర్ బద్దల కృష్ణమోహన్ పాల్గొన్నారు