దుష్ట దిగ్బంధంతో గ్రామ సంరక్షణ

★ లోక సుభిక్షం కోసం హోమం

పయనించే మేజర్ న్యూస్ జనవరి 17.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) పచ్చని పల్లెల్లో కార్చిచ్చు రేపి కుటుంబాల స్థితిగతులు మార్చుతూ వారి పతనానికి కారణభూతులైన దుష్టశక్తులను అడ్డగించి లోకం సుభిక్షంగా ఉండాలన్న తపనతో ఊరంతా కలిసి యజ్ఞ యాగాదులు హోమాలు వంటివి నిర్వర్తించారు ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని దేవదేవుని ప్రార్థిస్తూ గ్రామ దేవత గంగమ్మకు తమ బాధలు తెలుపుకొని ఆర్తి చేకూరేల ప్రజలందరూ కలసి ప్రార్థించారు అంతేకాకుండా శృంగేరి పీట అనుబంధ వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ యాగాదులు అష్ట బంధన దిక్బలి వంటివి చేపట్టారు పెద్దపంజాణి మండలం కొత్త వీరప్పల్లి క్షత్రియ కులస్తులందరూ ఏకమై గ్రామ సంరక్షణ కోసం హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు రాజ్యంలో కరువు కాటకాలు కుటుంబాల్లో ఆశకునాలు వంటి అపచార పరిస్థితులు దాపురించినప్పుడు ప్రజలను ఆదుకునే క్షత్రియులు యజ్ఞ యాగాదులు చేసేవారు వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న కొత్త వీరప్పల్లి క్షత్రియులు అదే బాటలో నడిచి లోకం సుభిక్షంగా ఉండాలని తాము నివసించే ప్రాంతం ప్రజలు దేవతల సంరక్షణలో ఉండాలని పలు కార్యక్రమాలు నిర్వహించారు శృంగేరి పీఠం అనుబంధ వేద పండితులు ఆధ్వర్యంలో గ్రామ పొలిమేరలో ఉన్న గంగమ్మ దేవస్థానం నందు గణపతి నవగ్రహ మృత్యుంజయ కాలసర్ప శాంతి హోమాలు జరిగాయి అదే విధంగా శ్రీరాముని దేవస్థానం ముందు గ్రామ నడిబొడ్డున చండీ ఆరాధన చండీ హోమం ఆశీర్వచనము తీర్థ ప్రసాద వినియోగము వేద మంత్రోచ్ఛరణ మధ్య జరిగింది అంతకుముందు రాత్రి గురు ప్రార్ధన గణపతి పూజ పుణ్యహవాచనం వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు బలి అదేవిధంగా ఉదయం అఘోరాస్త్ర హోమం అఘోర యంత్ర పూజ ఊరికి దిగ్బంధన అష్ట బలి మంత్రోక్త అష్టబలి వంటి కార్యక్రమాలు శాస్త్ర సుప్తంగా నిర్వహించారు సంక్రాంతిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన క్షత్రియులందరూ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి రాత్రి వరకు రెండు రోజుల పాటు పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రాలతో గ్రామం తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి మూడు రోజులపాటు గ్రామస్తులతో పాటు గ్రామానికి వచ్చిన అతిథులు బంధువులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో క్షత్రియులు ప్రముఖులు పాల్గొన్నారు