నడిగూడెం కోదండ రామస్వామి కళ్యాణ మండప నిర్మాణానికి విరాళం

పయనించే సూర్యడు జనవరి 17 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​ నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అనుబంధంగా రామ్ నగర్‌లో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఈ నిర్మాణ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా చాకిరాల గ్రామ వాస్తవ్యులు చిత్తలూరి విశ్వేశ్వరరావు - శ్రీదేవి దంపతులు రూ. 10,116/- (పది వేల నూట పదహారు రూపాయలు) నగదును విరాళంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను ప్రత్యేకంగా అభినందించారు. వారికి శ్రీ కోదండ రామస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ​పాల్గొన్న ముఖ్యులు: ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బి. వెంకటరత్నం , సూర్య ప్రకాష్ రావు , కొండ వెంకన్న , దయాకర్ , చెన్నూరు వెంకటేశ్వర్లు , దివ్వెల శ్రీనివాసరావు , బుస్సా మహేష్ , భువనగిరి ఉపేందర్ , చెన్నూరు లోకేశ్వరరావు , వందనపు మోహన్ రావు , గజ్జి అప్పారావు వందనపు మోహన్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.