పయనించే సూర్యుడు జనవరి 17, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే రాయపల్లి గ్రామ యువకుడు పాలెం మధు సూదన్ గౌడ్ తన అభిమానంతో, రాయపల్లి, ముదిరెడ్డి పల్లి ,రాజాపూర్ , బూరుగుపల్లి సర్పంచ్ల అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కోరిన మొక్కు తీరడం తో సంతోషం వ్యక్తం చేస్తూ రాయపల్లి దుర్గామాత అమ్మవారికి 140 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో రాయపల్లి సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్, డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ,రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ, ముదిరెడ్డి పల్లి సర్పంచ్ మీనా శేఖర్ గౌడ్ ,బూరుగుపల్లి శ్రీనివాస్ గౌడ్ ,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మొల్గర గంగాధర్ గౌడ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
