పయనించే సూర్యుడు జనవరి 17, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒగ్గుడోలు కళాకారుడు కొల్లూర్ శివరాజ్‌కు జాతీయ వేదికపై అరుదైన అవకాశం దక్కింది.వివరాల్లోకి వెళితే రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామానికి చెందిన కొల్లూర్ శివరాజ్ ఒగ్గుడోలు కళాకారుడు.ఎన్నో ఏళ్ల నుండి ఒగ్గుడోలు ప్రదర్శనలు ఇస్తూ కళాకారుడిగా రాణిస్తున్నారు.ఐతే జనవరి 26 న సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ ఆధ్వర్యంలో డిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర తరుపున, జనగాం జిల్లా మాణిక్యపురం గ్రామానికి చెందిన డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, యువ పురస్కార్ అవార్డు గ్రహీత ఒగ్గు రవి నేతృత్వంలో 6 జిల్లాల్లో ఎంపిక చేసిన 30 మంది ఒగ్గుడోలు కళాకారుల బృందంలో తనకు చోటు దక్కడం అదృష్టం అన్నారు.ఈ నెల జనవరి 25 వరకు నిరంతర రిహార్సల్స్ నిర్వహించి, అనంతరం జనవరి 26న ఢిల్లీ కర్తవ్య పథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగే గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. కొల్లూరు శివరాజ్ మాట్లాడుతూ ,తనకు వెన్నంటి నిలిచి మార్గనిర్దేశం చేసిన గురువులు డాక్టర్ ఉస్తాద్, ఒగ్గు రవి, మధికాల ఎర్రమల్లయ్య, సిరిగే పుల్లయ్య, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు ఆడికే శివకుమార్‌తో పాటు తోటి కళాకారులకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.