పేదల ఉపాధి కొల్లగొట్టే కుట్రలోభాగమే మోడీ విధానాలు

పయనించే సూర్యుడు, జనవరి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) పేద మధ్యతరగతి ప్రజల ఉపాధిని కొల్లగొట్టి దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడుదారి శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను రూపొందిస్తుందని సంయు క్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) రాష్ట్ర నాయకు లు వి తుకారం నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విధానాల ను మానకపోతే ఉద్యమాలు ఉదృతం అవుతాయని కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిం చారు.ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు కూలీ వ్యతిరేక విధానాలను చట్టాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సి కార్పొ రేన్ వద్ద ప్లే కార్డులతో నిరసన తెలియజే శారు. ఈ సందర్భంగా ముడి మార్టిన్ అధ్యక్షత వహించగా.వి తుకారాం నాయక్ మాట్లా డుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల తో సాధించు కున్న కార్మిక చట్టాలను, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా న్ని నిర్వీర్యం చేసి శ్రామికుల హక్కులను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యు త్తు విత్తన చట్టాల పేరుతో ప్రైవేటు కంపె నీలకు దాసోహం అయిందని ఈ క్రమం లో రైతులకు తీవ్రమైనహాని కలుగుతుం దని ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి ఆచ రణలో విదేశీ పెట్టు బడిదారులకు కార్పొ రేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంప దను కట్టబెడుతూ నియంతృత్వ విధా నాలకు చట్టాలకు పాల్పడుతున్నదని ఈ విధానాలను మానుకోకపోతే బిజెపి మోడీ ప్రభు త్వం తగిన గుణపా ఠం తప్పదని హెచ్చ రించారు.ఇప్పటికై నా మహాత్మా గాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకా న్ని యధావిధిగా కొనసాగించాలని నూతన విత్తన చట్టాన్ని సవరించాలని కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించు కోవాలని పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘ రాష్ట్ర నాయకులు వి తుకారం నాయక్.ముడి మార్తిన్.వామపక్ష నాయకులు సిపిఐ మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్. కె విటల్. ఎస్ కుమార్ మల్లయ్య యాద వ్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *