ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

★ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 బోధన్: బోధన్ పట్టణంలో అధికారులు ట్రాఫిక్ నియమాలపై మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పించవలసిందిగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత్, బోధన్ మండలం ఎమ్మార్వో విటల్, ఎసిపి శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకట్ నారాయణ, పట్టణ ఎస్సై భాస్కర్ చారి, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్మికుల సిబ్బందికి ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన విధివిధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలో పాటించడం వలన రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.నియమాలు పాటించకుండా వాహనాలు నడిపినట్లయితే జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం అనుభవించవలసి వస్తుందని హెచ్చరించారు. మైనర్ లకు మాత్రం వాహనాలను ఇవ్వకూడదని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాద రహిత తెలంగాణను సాధించు కుందామన్నారు. రోడ్డు నియమాలు పాటించకుండా వాహనాలు నడిపినట్లయితే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారమవుతామని హితవు చెప్పారు. రోడ్డు నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ సహకరించ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, బోధన్ మండల ఎమ్మార్వో విట్టల్, ఏసిపి శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకట్ నారాయణ, ఎస్సై భాస్కర్ చారి, అధికారులు మున్సిపల్ కార్మిక సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు.