పయనించే సూర్యుడు న్యూస్ మందమరి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య జనవరి 17 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది తొమ్మిది పది వార్డులలో డ్రైనేజీలు మురికి కాలువలు సీసీ రోడ్ల కొరకు కార్మిక శాఖ మంత్రి నీ భాజా భజంత్రీలతో ఎదుర్కొని ఉదయము ఎనిమిది గంటలకు కాలనీవాసులు స్వాగతం పలికారు తధానంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ కమిషనర్ గిద్దె రాజు లు కాలువలు రోడ్లు కోసం శంకుస్థాపనలు చేశారు అలాగే మునిసిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ వన్ మరియు టు చైతన్య కాలనీ ఎనిమిదవ వార్డులో రోడ్లు డ్రైనేజీల కొరకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని పనులు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ నగర్ కాలనీవాసులు మహిళలు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
