పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 ఎడపల్లి: భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి & శివసేన ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగిరేసిన సందర్భంగా టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్ మాట్లాడుతూ,ఎక్కడ ఎన్నికలు నిర్వహించిన బిజెపి పార్టీ విజయకేతనం ఎగురవేయడం చాలా సంతోషకరం అని నరేంద్ర మోడీ వారి నాయకత్వంలో బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా దూసుకెళ్తుందని మొన్న కేరళలో నేడు మహారాష్ట్రలో రేపు తెలంగాణ,రాష్ట్రoలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావo వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు