
పయనించే సూర్యుడు జనవరి 17 కరీంనగర్ న్యూస్: మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలలో మొత్తం 227 మున్సిపాలిటీలకు గాను 150 పైగా మున్సిపాలిటీలను బిజెపి , మిత్రపక్షాలు కైవసం చేసుకొని విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో కరీంనగర్ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్ లో సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి , మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతలు, మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు , మాజీ ఎంపీపీ వాసాల రమేష్ లు మాట్లాడుతూ దేశంలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలు బిజెపి పార్టీని ఆదరిస్తున్నారని, నేడు మహారాష్ట్ర లో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దీనికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, బిజెపితోనే అభివృద్ధి సాధ్యమనే భావన ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యంగా అన్నమలై ను రసమలై అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ఎద్దేవా చేయడం, హఠావో లుంగీ , బజవో పుంగి అని నినాదం చేసినందుకు మహారాష్ట్ర ఓటర్లు థాకరే వ్యాఖ్యలను తిప్పికొడుతూచెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారన్నారు. ముంబై కార్పొరేషన్ నుండి థాకరేను కనుమరుగు చేశారని తెలిపారు. త్వరలో జరగబోయే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బిజెపి సత్తా చాటి చెబుతామని, నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, కొలగని శ్రీనివాస్, వంగల పవన్ బండ రమణా రెడ్డి, కటకంలోకేష్, దుబాల శ్రీనివాస్, బల్బీర్ సింగ్, నాంపల్లి శ్రీనివాస్, గాజె రమేష్, నరహరి లక్ష్మారెడ్డి, ఈసంపల్లీ మహేష్, శ్రీనివాస్ రెడ్డి, రాజు, వాసు శ్రీధర్ బాలు, సుధాకర్ లతో పాటు జోన్ బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
