పయనించే సూర్యుడు జనవరి 17 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలంలోని కొత్త తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి సందర్భంగా సర్పంచ్ పాత్లావత్ నందు నాయక్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. బహుమతులకు సహకరించిన దాతలు సర్పంచ్ మొదటి బహుమతి, రెండవ బహుమతి ఉప సర్పంచ్ అఖిల రవి, మూడవ బహుమతి కే. దసరా,నాలుగవ బహుమతి జె.రవి, ఐదవ బహుమతి ఎన్.లక్ష్మణ్, ఆరవ బహుమతి కె. వాల్సింగ్, ఏడవ బహుమతి ఎన్. అంజి బహుమతులు సహకరించిన దాతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.