మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర బృందం

* క్షేత్రస్థాయిలో అంచనా వేసిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సంయుక్త డైరెక్టర్ గయా ప్రసాద్.

పయనించే సూర్యుడు జనవరి 17 ఎన్ రజినీకాంత్:- మెంత తుఫాను దాటికి నష్టం ప్రాంతాలను స్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సంయుక్త డైరెక్టర్ గయా ప్రసాద్ బృందం శుక్రవారం భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలంలోని కొప్పూర్, విశ్వనాధ్ కాలనీ లో జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.. ఈ సందర్భంగా రెండు గ్రామాలలో తీవ్ర వర్షానికి నష్టపోయిన నీట మునిగిన పంట వివరాలు, దెబ్బతిన్న రోడ్లు, గాలివానకు కూలిపోయిన ఇండ్ల వివరాలు, మృతి చెందిన పశువుల వివరాలు, సంబంధించిన అంశాలపై అధికారుల వద్ద వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందంతో పాటు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా అదనపు కలెక్టర్ నెమరుకొమ్ముల రవి, డివిజనల్ ఆఫీసర్ సుమ, భీమదేవరపల్లి తహసిల్దార్ రాజేష్, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *