యువత క్రీడల్లో రాణించాలి : మాజీ ఉప సర్పంచ్ కాసాల జనార్దన్ రెడ్డి.

పయనించే సూర్యుడు చండూరు జనవరి 17 సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని గుండ్రపల్లి మాజీ ఉపసర్పంచ్ కాసాల జనార్దన్ రెడ్డి నేతృత్వంలో గుండ్రపల్లి ఎంపీటీసీ పరిధి వాలీబాల్ టోర్నమెంట్ గ్రామంలో నిర్వహించారు. శుక్రవారం మీడియాతో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, యువత క్రీడల్లో రాణించటానికి తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్ లో పలు జట్లు తలపడగా మొదటి బహుమతి గెలుపొందిన కురుపాటి రాజకుమార్ టీంకు జనార్దన్ రెడ్డి పదివేల రూపాయలు అందజేశారు. రెండవ బహుమతి గెలుపొందిన దామెర అనిల్ టీంకు పెండ్యాల గీత ఐదు వేల రూపాయలు అందజేశారు. ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్న గ్రామ యువతకు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.