పయనించే సూర్యుడు జనవరి 17, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ-ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందు గత రెండు రోజుల నుండి నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్ విజేత ఆర్ సి బాయ్స్ క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులను సిఐటియు జిల్లా నాయకులు ఈరన్న డివైఎఫ్ఐ మాజీ నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, కాలనీ పెద్దలు ఈరప్ప చేతుల మీదుగా యువ క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ చాలా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం సంతోషకరమని వారు తెలిపారు. ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగ పడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ ను మానేసి, ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు. క్రికెట్, క బడ్డీ ఏదైనా ఆటలు నిర్వహించుకోవడానికి యువతీ, యువకులకు స్థానికంగా ఎటువంటి మైదానాలు లేక సొంత స్థలాలలోనే ఆడుకుంటున్నారని వారు తెలిపారు. స్థానికంగా యువత ఆటలు నిర్వహించు కోవడానికి మైదానాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులలో యువత మత్తు పదార్థాలు డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఇది చాలా ప్రమాదకరమని వారు వివరించారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు మాత్రం యువతను మంచి మార్గంలో నడిపించడానికి వారి జీవితాల బాగు కోసం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టరని, భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా శాఖలో ఉన్న అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ చేపట్టే అన్ని కార్యక్రమాలలోయువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాలని యువకులు వినోద్, వీరేష్, నాగరాజు, కైలాష్, కుమార్, కార్తీక్, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.