యూనివర్సల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మమ్మాయిపల్లి లో సంక్రాంతి క్రికెట్ సంబరం

★ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సరోజనమ్మ ఉపసర్పంచి రాము

పయనించే సూర్యుడు జనవరి 17 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మమ్మాయిపల్లి గ్రామంలో యూనివర్సల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో యువకులు క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక జట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాయి. క్రికెట్ పోటీలను యూనివర్సల్ యూత్ అధ్యక్షుడు నక్క వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం జరిగిన ఫైనల్ పోటీల్లో ఏలేట్–11 జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతిని గెలుచుకోగా, కురమూర్తి టీమ్ రెండో బహుమతిని సాధించింది. విజేతలకు గ్రామ సర్పంచ్ సరోజనమ్మ , ఉపసర్పంచ్ కదిరే రాములు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్‌మన్గా హేమాకాంత్, బెస్ట్ ఆల్‌రౌండర్గా హేమాకాంత్, బెస్ట్ బౌలర్గా ప్రణీత్ ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ మెమెంటోలు, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు జయమ్మ, భాగ్యలక్ష్మి, యూనివర్సల్ యూత్ క్లబ్ సభ్యులు ప్రశాంత్, ఆనంద్, చిన్నమోని కుర్మయ్య, బచ్చయ్య, ప్రభు, సౌట రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.