పయనించే సూర్యుడు జనవరి 17, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాయపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న ‘పాలెం రామస్వామి గౌడ్ స్మారక రాయపల్లి ప్రీమియర్ లీగ్ ఆర్ పీఎల్ ‘ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం అట్టహాసంగా ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పిఆర్ జి వారియర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు మొదటి బహుమతిగా పాలెం మహేష్ గౌడ్ రూ. 20,000 నగదు , మెడల్స్ మరియు మెరిసిపోతున్న విజేత ట్రోఫీని అందజేశారు. రన్నరప్ జట్టుకు కూడా బహుమతులను ప్రధానం చేశారు..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాయపల్లి గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ తో పాటు ,రాజాపూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షులు కాటేపాగ ఆనంద్ ,మండల బీజేపీ నాయకులు డబ్ల్యు నర్సింహ, పోలేపల్లి సర్పంచ్ కందూరు శ్రీశైలం ,పోలేపల్లి డిప్యూటీ సర్పంచ్ పురుషోత్తం లు , బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మొల్గర గంగాధర్ గౌడ్, లు మాట్లాడుతూ , క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా యువతలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు రాయపల్లి గ్రామ డిప్యూటీ సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ లు కమ్మదనం నర్సింలు గౌడ్ , నేరళ్ళ గంగాధర్ గౌడ్, నరిగె లక్ష్మయ్య ,డీలర్ రాములు తో పాటు గ్రామ పెద్దలు యువకులు ,క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
