రాష్ట్ర ప్రభుత్వము నియమించినజర్నలిస్టు అక్రిడేషన్ కమిటీలో రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ సభ్యునిగా

పయ నించే సూర్యుడు జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రేటర్ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ నిట్టల బాపురావు నియమింపబడిన సందర్భంగా ఆ పత్రికలో పనిచేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రిపోర్టర్ వరదా సూరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆ పత్రికలో పనిచేస్తున్న విలేఖరులు అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి దర్శనానంతరం ఆయనను సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంచిపల్లి అబ్బులు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, అమలాపురం శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్న సాలువాతో సత్కరించి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు వీరితో పాటు గ్రేటర్ న్యూస్ విలేకరులు కాట్రేనికోన గ్రంధి నానాజీ, అయినవిల్లి కె. శ్రీనివాసు అమలాపురం రూరల్ పెయ్యల వేంకటేశ్వరరావు, అమలాపురం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రoబాల సత్యనారాయణలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాపురావుకి శుభాకాంక్షలు తెలిపారు.