పయనించే సూర్యుడు జనవరి 17 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల లలో వైద్యసేవలు మరింత మెరుగు పడనున్నాయి. ప్రభుత్వం కొత్తగా ల్యాబ్ టెక్నీ షియన్లకు పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసింది. 2024 సంవత్సరం నవంబరులో మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ల్యాబ్ టెక్నీషియన్ల నియామ కానికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఉత్తీ ర్ణత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం గతేడాది నవంబరులో ఎంపికైన టెక్నీషియన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా మెడికల్ కాలేజ్ కు 33మంది అభ్యర్థులు నియామకమయ్యారు. వీరికి మంగళవారం ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియమాక పత్రాలు అందజేశారు. వారందరూ రిపోర్ట్ చేశారు. వీరి రాకతో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ లో మూత్ర ,రక్త పరీక్షలు,రిపోర్టుల ఆలస్యానికి చెక్ పడనుంది.