రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాల అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

★ జనగామజిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ , బీఎండబ్ల్యూవో, ప్రిన్సిపాల్స్

పయనించే సూర్యుడు జనవరి 17 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జిల్లాలోని ముస్లిం మైనారిటీలందరూ స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాలలో మైనారిటీ రెసిడెన్షియల్ అడ్మిషన్ల కోటను సద్వినియోగం పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు మైనారిటీ అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ ను ఆయన శుక్రవారం కలెక్టరేట్లో విడుదల చేశారు జిల్లా లోని ఒక బాలుర (జనగామ) లో, ఒక బాలికల (స్టేషన్ ఘన్పూర్)లోని పాఠశాల, కళాశాలలో గల సీట్లలో 80% మైనారిటీలకు, 20% నాన్ మైనార్టీలకు సీట్స్ అందుబాటులో ఉన్నాయని పాఠశాలల్లో ఐదవ తరగతి, కళాశాలలో ప్రథమ సంవత్సరంలో నూతన అడ్మిషన్లతో పాటు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో బ్యాక్లాగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మైనార్టీలకు నాణ్యమైన విద్యతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలు,భోజనం,వసతి, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ తో పాటు ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని అంకితభావం అత్యంత అనుభవం కలిగిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులచే బోధించబడును. కళాశాలలో నీట్ జెఈఈ కోచింగ్ సౌకర్యం కలదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ విక్రమ్ కుమార్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ కే. కుమారస్వామి, కళాశాల ప్రిన్సిపల్ పి.అనిల్ బాబు అధ్యాపకులు తాయినాత్ సగీరా, పెట్లోజు సోమేశ్వరా చారి, రెహానా వార్డెన్ సల్మాన్,ఫసి పాల్గొన్నారు.