పయనించే సూర్యుడు జనవరి 17 దండేపల్లి దండేపల్లి మండలం గుడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సాగునీరు అందించడం కోసం తానిమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ నుంచి హజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ వరకు నీటిని విడుదల చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇరిగేషన్ అధికారులు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సాగరన్న.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి ,జిల్లా అధికారులు, స్పరంచ్లు, ఉప సర్పంచ్లు , వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.