పయనించే సూర్యుడు జనవరి 17 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శుక్రవారం కేశపట్నం మండల తాసిల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగినది . తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లమారెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా. సిఐటియు.వ్యవసాయ కార్మిక సంఘం. మూడు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా వినతి పత్రం ఇవ్వడం జరిగినది . వెలమరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు . రైతు కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా చట్టాలను అమలు చేస్తున్నారు దీనికి నిరసిస్తూ శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం జరిగినది. నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని. కేంద్ర విత్తన బిల్లును ఉపసంహరించాలని.వి బి జి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలని సమగ్ర రుణమాఫీ చేయాలని.నకిలీ ఎరువులు పురుగు మందులు అమ్మిన వారిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని.ఎంఎస్పి అమలు చేయాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని. రవి పంటకు ఎగరానికి 7500 రైతు భరోసా ఇవ్వాలని. భూభారతిలో భూ సమస్యలను పరిష్కరించాలని.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కన్నెబోయిన తిరుపతి. ఇమ్మడి చక్రపాణి. నారాయణరెడ్డి.వెంకటేష్. సమ్మయ్య గోపు వీరమల్లు తదితరులు పాల్గొన్నారు