వెన్నంపల్లి స్వయంభు సమ్మక్క- సరలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిటీ సభ్యులు.

పయనించే సూర్యుడు జనవరి 17 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి వెన్నంపల్లి గ్రామంలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరను భక్తులు సౌకర్యవంతంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చైర్మన్ సమ్మిరెడ్డి సూచించారు. శుక్రవారం రోజున సమావేశం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. సమ్మక్క గద్దెలు పరిసర ప్రాంతాలను సందర్శించి జాతర ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అవసరమైన శుద్ధమైన తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సదుపాయాలు, పారిశుద్ధ్య చర్యలు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతూ జాతర ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.జాతరను విజయవంతంగా నిర్వహీంచేందుకు తమ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సందుపట్ల రవీందర్ రెడ్డి, కంది ప్రసాద్ రెడ్డి, మారుపాక తిరుపతి, ములుగురి సంపత్, బీసా నర్సయ్య, మారుపాక రమేష్, బండి రమేష్, తీగల రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.