సంక్రాంతి సందర్భంగా ‘వార్త’ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు జనవరి 17, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు జాతీయ దినపత్రిక వార్త 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తా జాతీయ దినపత్రిక యాజమాన్యానికి, మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు, వార్త మధిర నియోజకవర్గం స్టాఫ్ రిపోర్టర్ శ్రీ రామోజు యోగేష్, చింతకాని రిపోర్టర్ గార్లపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.