
పయనించే సూర్యుడు జనవరి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) సంస్కార భారతి రంగారెడ్డి జిల్లా శాఖ షాద్ నగర్ వారి ఆధ్వర్యంలో ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు అనే వినూత్న కార్యక్రమాన్ని సంస్కారభారతి ఆధ్వర్యంలో ఎస్.ఎల్.ఎన్ తెలుగు రుచులు వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు .షాద్ నగర్ లోని ఎంపిక చేసిన కొన్ని కాలనీ లలో సంస్థ సభ్యులు పర్యటించి పండుగ సందర్భంగా ఇంటి ముందు స్వచ్ఛందంగా ఎవరైతే పండుగ ప్రాశస్త్యాన్ని సామాజిక ఇతివృత్తాలు ప్రతిబింబించేలా అందంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారిని ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తూ శాలువ, ప్రశంసా పత్రం తో పాటు ఆకర్షణీయమైన బహుమతిని అందించి అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ.వీ.రంగయ్య మాట్లాడుతూ ముగ్గులు మన సంప్రదాయం లో అంతర్భాగమని మగువలు అక్షరాలు దిద్దకముందే ముగ్గులు అందంగా దిద్దడం నేర్చారని ముగ్గులు ఇంటికి అందం , ఆకర్షణ, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని అందిస్తాయని ముగ్గులు ఇంటికి శుభ సూచకమని ఎవరైతే ఇంటి ముందు నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి తో పాటు దేవతలు కొలువై ఉండి సిరిసంపదలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారని అన్నారు.ఇంటిముందు ముగ్గులు వేసే సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈవిధానాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ముగ్గులు వేసే సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ విధానాన్ని చేపట్టామని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు ఉండేలా చూసుకుంటే మంచిదని సూచించారు. సంస్కార భారతి గౌరవ సలహాదారులు శ్రీ బెజుగం రమేష్ మాట్లాడుతూ… ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మన తన అనే తేడా లేకుండా ఎవరైతే స్వచ్ఛందంగా ఇంటి ముందు ముగ్గులు వేసిన వారిని గుర్తించి బహుమతులు అందించడం చాలా మంచి విధానమని పండుగ నాడు అనుకోకుండా తమ ముగ్గును గుర్తించి బహుమతిని అందించినందుకు మహిళలు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారని .దాదాపు పదిహేను కాలనీలలో ఆకర్షణీయమైన బహుమతులను అందించడం జరిగిందని ముందు ముందు మరిన్ని కాలనీలకు విస్తరిస్తామని బెజుగం రమేష్ అన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నేత అందే బాబయ్య తో పాటు సంస్థ గౌరవాధ్యక్షులు కే.రంగనాథం విశ్రాంత గెజిటెడ్ హెడ్మాస్టర్ ఉపాధ్యక్షులు మల్లికార్జున గౌడ గెజిటెడ్ హెడ్మాస్టర్ సింగారం శ్రీనివాస్ సంస్థ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా రవీందర్ శివ ప్రధాన కార్యదర్శి స్వాతి రెడ్డి సంస్థ మహిళా శక్తి కన్వీనర్ కాకతీయ స్కూల్. ప్రిన్సిపాల్జి. రంగారెడ్డి సంస్థ సలహాదారు, నవోదయ ఆశ్రమ నిర్వాహకులు సీనియర్ కళాకారులు టీ.కృష్ణ మహబూబ్నగర్ అనంతయ్య మాజీ కౌన్సిలర్ సభ్యులు యశ్విత గౌతమ్ లు కార్యక్రమంలో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యతను గొప్పదనం గురించి వివరించారు.