పయనించే సూర్యుడు జనవరి 17 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శంకరపట్నం మండల కేంద్రం లో గల సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి కార్యక్రమాలను కేశవపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం నాడు వాహన పూజ నిర్వహించి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నుండి సమ్మక్క గద్దెల మీదుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, మరియు ప్రధాన రహదారి, బస్టాండ్ నుండి ఎత్తుగడ్డ మీదుగా బైపాస్ రోడ్డు వద్దకు మరియు ఎల్లమ్మ ఆలయం నుండి వాగు వరకు జంగిల్ క్లియరెన్స్, సనిటైసేషన్, తాత్కాలిక మరుగు దొడ్లు, స్నాన ఘట్టాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, భక్తుల వివిధ రకాల అవసరాలు కోసం అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ పంచాయతీ కార్యదర్శి, సమ్మక్క కమిటి చైర్మన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు