పయనించే సూర్యుడు జనవరి 17 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ళ ప్రస్థానం సందర్భంగా ఈ నెల 18వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయని ఆ కార్యక్రమాన్ని విజయవంతం కొరకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయ ప్రదం చేయాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు నాగనాథ్ హళ్లి గ్రామములో సిపిఐ పార్టీ పతాకాన్ని గ్రామ కార్యదర్శి సిద్దలింగ ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్, మండల కార్యదర్శి కల్లుబావిరాజు పాల్గొని మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో ఆవిర్భవించి నేటికీ ఆ పార్టీకి వందేళ్లు నిండుకున్నాయని అన్నారు. భారతదేశ సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని ప్రతి పేదవాడికి సాగు భూమి ఉండాలని సంకల్పంతో పెత్తందారులపై పోరాటాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు భూ పంపిణీ చేసిన ఘన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు . స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర పోషించని ఆర్ఎస్ఎస్, బిజెపి , నాయకులు ప్రజల మధ్యన మత ఘర్షణలు సృష్టించి దళిత, పేద, బడుగు ,బలహీన వర్గాల ప్రజలపై దౌర్జన్యంతో దాడులకు పూనుకుంటున్నారని ఆరోపించారు.గ్రామాలలో ఉపాధి లేక తినడానికి తిండి లేక ముసలి ముదక ఇళ్ల దగ్గర వదిలి తమ బిడ్డలను చదివించుకోకుండా తట్టా, పుట్ట సర్దుకొని ఇంటికి తాళాలు వేసి పిల్లా, పాపలతో పక్క రాష్ట్రాలకు వెళ్లి బ్రతుకుతున్నారని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని 2005 సంవత్సరములో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తే ప్రస్తుతం అహంకారంతో అధికారాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా వి బి జి రామ్ జి పథకాన్ని ప్రారంభించి ఉపాధి హామీ కార్మికుల కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గ్రామాలలో ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.